సంక్షేమ వసతి గృహాలు చదువులకు నిలయాలా..? ఆత్మహత్యలకు నిలయాలా..?
విద్యార్థి మృతిపై వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన వార్డెన్, సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి ప్రజాపక్షం/ఖమ్మం : సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు చదువుల నిలయాలుగా ఉండాలి కానీ, విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అజయ్ మృతి ఘటనకు బాధ్యులైన వార్డెన్, సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతిని నిరసిస్తూ శనివారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ.. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వసతి గృహం నిర్వాహకులు తగిన శ్రద్ధ చూపకపోవడమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం అందించ...